Udhayanidhi stalin | న్యూఢిల్లీ: సనాతన ధర్మం వ్యాఖ్యలపై స్పందనను తెలియజేయాలంటూ తమిళనాడు ప్రభుత్వానికి, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం స్పందనను తెలియజేయాలంటూ తమిళనాడు ప్రభుత్వానికి, ఉదయనిధికి నోటీసులు జారీ చేసింది. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆశ్రయించడం ద్వారా సుప్రీంకోర్టును పోలీస్ స్టేషన్‌గా మార్చేశారని న్యాయస్థానం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. పిటిషనర్లు ముందుగా హైకోర్టును ఆశ్రయించాల్సిందని పేర్కొన్నది.