న్యూఢిల్లీ: బిల్కిస్ బానో అత్యాచార కేసులో జైలు శిక్ష అనుభవించిన 11 మందిని ఇటీవల గుజరాత్ ప్రభుత్వ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. గ్యాంగ్ రేప్ నిందితుల రిలీజ్‌ను సవాల్ చేస్తూ ఇవాళ బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసింది. ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. గోద్రా అల్లర్ల నేపథ్యంలో బిల్కిస్ బానోపై రేప్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2008లో ఆ కేసుకు సంబంధించి 11 మందిని దోషులుగా తేల్చారు. జీవితకాల శిక్షను అనుభవించిన ఆ 11 మందిని ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన గుజరాత్ ప్రభుత్వం రిలీజ్చేసింది.