న్యూఢిల్లీ: షెడ్యూల్డు కులాలకు కల్పించిన రిజర్వేషన్లను వాటిలోని ఉప కులాలను వర్గీకరించి కేటాయించే అధికారం రాజ్యాంగబద్ధంగా రాష్ర్టాలకు ఉందని గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ తీర్పులో పొరపాటు లేదని చెప్పింది. ఈ తీర్పును ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చింది.
దీనిని పునః సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను అదే ధర్మాసనం పరిశీలించి, డిస్మిస్ చేసింది. వీటిని ఓపెన్ కోర్టులో లిస్ట్ చేయాలన్న విజ్ఞప్తిని కూడా తిరస్కరించింది. ఈ కేసులో మెజారిటీ తీర్పుతో ఏకీభవించకుండా ప్రత్యేక అభిప్రాయాన్ని తెలిపిన జస్టిస్ బేలా ఎం త్రివేది కూడా ఈ పిటిషన్లను పరిశీలించి, డిస్మిస్ చేశారు.