న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవల(SBI Services)కు ఇవాళ అంతరాయం ఏర్పడింది. టెక్నికల్ సమస్య వల్ల ఎస్బీఐ సేవలకు బ్రేక్ పడింది. దీంతో ఆ బ్యాంకుకు చెందిన ఆన్లైన్ సర్వీసులు స్తంభించిపోయాయి. యోనో, ఆర్టీజీఎస్, నెఫ్ట్, యూపీఐ, ఐఎన్‌బీ, ఐఎంపీఎస్ సర్వీసులు నిలిచిపోయాయి. ఎస్బీఐ మొరాయిస్తున్న అంశాన్ని డౌన్‌డిటెక్టర్ ద్వారా గుర్తించారు. ఇంటర్నెట్లో ఎస్బీఐ సేవలకు అంతరాయం కలుగుతున్నట్లు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సుమారు 400 కస్టమర్లు ఫిర్యాదు చేశారు. డౌన్‌డిటెక్టర్‌లో ఈ విషయాన్ని తేల్చారు. అయితే ఎస్బీఐ మధ్యాహ్నం రెండు గంటలకు కీలక ప్రకటన చేసింది. తమ బ్యాంకుకు చెందిన అన్నీ సర్వీసులను రిస్టోర్ చేసినట్లు ఎస్బీఐ తన ట్వీట్ పోస్టులో చెప్పింది.
All our services are available since 14:00 hrs.
Inconvenience caused is regretted.— State Bank of India (@TheOfficialSBI) July 2, 2025