న్యూఢిల్లీ: దేశంలో ఆహార భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్నది. ఎఫ్వై26 చేసిన టెస్టుల్లో ప్రతి 6 శాంపిళ్లలో ఒకటి ఫెయిల్ అయింది. ఇది కేవలం చిన్న నంబర్ కాదని.. భారతీయ ఆహార భద్రత ప్రమాదంలో ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఆహార లోపాలు వ్యవసాయ క్షేత్రాలతో పాటు ఫ్యాక్టరీలు, కిరాణా స్టోర్లు, రెస్టారెంట్లు, చివరకు ఇంట్లోని కిచెన్లో కూడా ఉన్నట్టు చెబుతున్నారు. ఈ ఆహార నాణ్యతా లోపాలు వినియోగదారుల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని ఆరింగ్ రిసెర్చ్ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ అరోరా వెల్లడించారు.
చివరకు పాలు, పెరుగు, పన్నీర్, చిరు ధాన్యాలు, పప్పులు లాంటివి కూడా కల్తీ కావడంతో వినియోగదారులు ఆహారాలను తినడానికి కూడా సంకోచిస్తున్నారని సౌరభ్ చెప్పారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు కూడా వినియోగదారులను అయోమయానికి గురి చేస్తున్నాయని.. ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోలేకపోతున్నారంటూ అరోరా వాపోయారు.