Satyendar Jain | ఆప్ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు ఊరట.. జల్ బోర్డు కేసులో బెయిల్ మంజూర్
Satyendar Jain : ఆప్ నేత, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు భారీ ఊరట లభించింది. జల్ బోర్డు కేసులో అరెస్టైన ఆయనకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది.
Satyendar Jain : ఆప్ నేత, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు భారీ ఊరట లభించింది. జల్ బోర్డు కేసులో అరెస్టైన ఆయనకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. రూ.2 లక్షల పూచీకత్తు, ఇద్దరు సంతకాల హామీతో సత్యేంద్ర జైన్‌కు బెయిల్ లభించింది.
పీసీ యాక్ట్ కింద స్పెషల్ జడ్జి సత్యేంద్ర జైన్‌కు బెయిల్ ఇస్తున్నట్లు ప్రకటించారు. సత్యేంద్ర జైన్ గతంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. ఈ సమయంలో ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ)లో జరిగిన అవినీతి కేసులో గత ఆగష్టు 18న సత్యేంద్ర జైన్‌ను ఢిల్లీలో ఏసీబీ అరెస్టు చేసింది. డీజేబీలో మురికినీటి శుద్ధీకరణ ప్లాంట్ టెండర్ల ప్రక్రియలో అవినీతి జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి ఇందులో మంత్రి సత్యేంద్ర జైన్‌తోపాటు డీజేబీ సీఈవో ఉదిత్ ప్రకాష్ రాయ్, మాజీ కాంట్రాక్టువల్ కన్సల్టెంట్ అంకిత్ శ్రీవాస్తవతోపాటు మరో ఇద్దరిని ఏసీబీ అరెస్టు చేసింది.
తన అరెస్టుకు వ్యతిరేకంగా సత్యేంద్ర జైన్ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు గురువారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ అరెస్టును ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. రాజకీయ కుట్రలో భాగంగానే ఆయనను అరెస్టు చేశారని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఈ అంశంలో బీజేపీ, ఆప్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు నడిచాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

