ముంబై : ఎన్సీపీ నేత అజిత్ పవార్ తన మామ, పార్టీ చీఫ్ శరద్ పవార్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసి 8 మంది ఎమ్మెల్యేలతో షిండే సర్కార్‌లో చేరడం కలకలం రేపింది. ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ ఫిరాయింపు అనంతరం శివసేన (యూబీటీ) నేత, ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) కాషాయ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో బీజేపీ సీరియల్ కిల్లర్, సీరియల్ రేపిస్ట్ వంటిదని దుయ్యబట్టారు. ఈ ఉదంతం వెనుక ఢిల్లీ మైండ్ (కేంద్రం) ఉంది..వారు రాజకీయాల్లో సీరియల్ రేపిస్టులు, సీరియల్ కిల్లర్స్ వంటిదని విమర్శించారు.
గతంలో మాదిరే వారు పార్టీలను చీల్చే నేరానికి పాల్పడ్డారని ఆరోపించారు. కాషాయ నేతలు రాజకీయ పార్టీలను తమ సొంత ప్రయోజనాలకు చీల్చుతారని, ఆపై చీలిక గ్రూపులు అసలైన పార్టీ తమదే అని చెప్పుకుంటాయని రౌత్ పేర్కొన్నారు. అజిత్ పవార్ సొంత పార్టీపై తిరుగుబాటు చేసిన అనంతరం నాలుగేండ్లలో మూడోసారి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పగ్గాలు చేపట్టారు.
అజిత్ పవార్ వర్గీయుల తిరుగుబాటుతో పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ ప్రఫుల్ పటేల్, ఎంపీ సునీల్ తత్కరె సహా ఐదుగురు నేతలను ఎన్సీపీ బహిష్కరించింది. మరోవైపు రెబెల్స్‌పై అనర్హత వేటు వేయాలని కోరుతూ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది.
Read More :
China Youth | చైనా యువత బెంబేలు.. వయసు 35 దాటితే ఉద్యోగం ఊస్ట్