వేల కోట్ల విలువైన పత్రా చానల్ భూ అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. ఈ ప్రకటనపై ఎంపీ సంజయ్ రౌత్ ఘాటుగా స్పందించారు. తానేమీ భయపడటం లేదని స్పష్టం చేశారు. తన ఆస్తులను సీజ్ చేసినా, షూట్ చేసినా, జైలుకు పంపినా.. తాను మాత్రం బెదిరేది లేదని ప్రకటించారు. తాను బాలాసాహెబ్ అనుచరుడినని, శివసైనికుడినని చెప్పుకొచ్చారు. తాను ఎంత మాత్రమూ సైలెంట్‌గా ఉండనని, పోరాడుతూనే వుంటానని ప్రకటించారు. కేంద్రం ఇప్పుడు తెగ ఎగురుతోందని, ఎగరనివ్వండని, ఎప్పుడో ఒకప్పుడు సత్యం మాత్రం బయటికి వచ్చి తీరుతుందని సంజయ్ రౌత్ అన్నారు.
శివసేన ఎంపీ, సీనియర్ నేత సంజయ్ రౌత్‌కు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు షాకిచ్చారు. ఆమె భార్యకు చెందిన దాదాపు 11 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అయితే ఈ 11 కోట్లలో 9 కోట్లు రౌత్ కుమారుడు ప్రవీణ్ రౌత్‌కు సంబంధించినవి కాగా… 2 కోట్లు సంజయ్ రౌత్ భార్యకు సంబంధించినవి. వెయ్యి కోట్ల పట్రా చాల్ భూ కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రౌత్‌కు సంబంధించిన అలీబాగ్ ప్లాట్, ముంబైలోని ఒక్కొక్క ఫ్లాట్‌ను అటాచ్ చేసింది.