Sanjay Nirupam | మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భంగపాటు తప్పదు : శివసేన
Sanjay Nirupam : రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు రాబట్టలేదని శివసేన నేత సంజయ్ నిరుపమ్ అన్నారు.
Sanjay Nirupam : రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు రాబట్టలేదని శివసేన నేత సంజయ్ నిరుపమ్ అన్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రాష్ట్ర నాయకత్వం పట్ల విశ్వాసం, గౌరవం లేదని పేర్కొన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి చాలా బలహీనంగా ఉందని అన్నారు. పార్టీ నాయకత్వం బలహీనంగా ఉందని, వారికి పార్టీ శ్రేణులపై పట్టు లేదని చెప్పారు.
సంజయ్ నిరుపమ్ మంగళవారం ముంబైలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మహారాష్ట్రలో కాంగ్రెస్ పరిస్ధితి అధ్వాన్నంగా ఉందని చెప్పారు. మరోవైపు కర్నాటక సీఎం సిద్ధరామయ్యపై కేంద్ర మంత్రి శోభా కరంద్లాజె తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి సిద్ధరామయ్య మైసూర్ అర్భన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA)లో అక్రమంగా 12 స్ధలాలు స్వాహా చేశారని ఆరోపించారు. 1992లో ముడా కేసరె గ్రామంలో భూ సేకరణ చేపట్టి రూ. 3.81 లక్షల పరిహారం అందించిందని చెప్పారు.
అయితే పార్వతి సిద్ధరామయ్య పరిహారం అంగీకరించలేదని, అప్పట్లో సిద్ధరామయ్య ఆర్ధిక మంత్రిగా ఉన్నారని ఆమె గుర్తుచేశారు. 1998లో ఆయన డిప్యూటీ సీఎంగా వ్యవహరించిన సమయంలోనూ ఈ వ్యవహారంపై మౌనం దాల్చారని చెప్పారు. 2017లో పరిహారం కోసం సిద్ధరామయ్య ముడాపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. 2022లో నిబంధనలకు విరుద్ధంగా పార్వతి సిద్ధరామయ్యకు కేసరె గ్రామంలో సేకరించిన భూమి నుంచి 14 సైట్లను ముడా కట్టబెట్టిందని చెప్పారు.
Read More :
NEET paper leak | నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన సీబీఐ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

