Sandeep Pathak : ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో డబ్బును ఎక్కడా స్వాధీనం చేసుకోలేదని, ఎలాంటి రికవరీలు లేవని ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ అన్నారు. ఈ మొత్తం కేసును ఈడీ సృష్టించిందని చెప్పారు. అసలు నేరమే జరగకుండా స్కాం ప్రసక్తి ఏముంటుందని, నేరం జరగనప్పుడు ఎవరిపైనో ఆరోపణలు చేయడం అర్ధరహితమని పేర్కొన్నారు.
ఈ స్కామ్ తతంగమంతా బీజేపీ నడిపిస్తోందని, కాషాయ పార్టీ కనుసన్నల్లో ఆ పార్టీ కార్యాలయంలోనే ఎక్సైజ్ పాలసీ కేసుకు రూపకల్పన చేశారని దుయ్యబట్టారు. లిక్కర్ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొన్నదని గుర్తుచేశారు. చివరికి కోర్టు చెబుతున్న మాటలనూ వారు అంగీకరించడం లేదని దుయ్యబట్టారు. కోర్టు ఉత్తర్వులనూ పట్టించుకోని రీతిలో నియంత పోకడలను కాషాయ పాలకులు అనుసరిస్తున్నారని ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ ఆరోపించారు.
మరోవైపు లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను బీజేపీ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అరెస్ట్ చేసి జైలుపాలు చేసిందని ఆప్ నేతలు విరుచుకుపడుతున్నారు. కేజ్రీవాల్‌కు బెయిల్ రాకుండా అడ్డుకుంటోందని దుయ్యబట్టారు. మోదీ ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్ధులపై కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను ప్రేరేపించి దాడులకు తెగబడుతున్నదని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.
Read More :
Rains | మరో రెండు రోజులు భారీ వర్షాలు.. 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్