న్యూఢిల్లీ : ఆరు పదుల్లో అడుగుపెట్టగానే హాయిగా విశ్రాంత జీవితాన్ని (Viral Post) ఆస్వాదిస్తూ గడపాలని అందరూ కోరుకుంటారు. రిటైరైన తర్వాత జీవితాన్ని ఎలా గడపాలనే ప్లానింగ్‌లో పలువురు మునిగితేలుతుంటారు. అయితే పనిలోనే సంతృప్తిని వెతుక్కునే వారు అరుదుగా కనిపిస్తారు. ఈ తరహా వ్యక్తుల గురించి వింటే పదవీ విరమణ తర్వాత కూడా పనిచేయాలనే ఉత్సుకత ఉరకలెత్తుతుంది.
ఉదయ్‌పూర్‌లోని ఓ సమాసాల విక్రేత స్ఫూర్తిదాయక స్టోరీని ఆర్యాన్ష్ ట్విట్టర్లో షేర్ చేశారు. ఇంటి వద్ద విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో పెద్దాయన ఎలా కష్టపడుతున్నదీ ఈ పోస్ట్ వెల్లడిస్తుంది. నేను ఉదయపూర్ కోర్టు సర్కిల్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ పక్కన కారు పార్క్ చేస్తుండగా జోరు వానలో అక్కడ ఓ పెద్దాయన వేడివేడి సమోసా, పోహ అమ్మడం చూశానని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చాడు.
It was raining heavily when I parked my car beside a traffic signal near court circle udaipur, where I saw an old uncle selling hot samosa and poha. I placed an order and curiously asked him why he didn’t take a rest today, considering his age. He told me something that… pic.twitter.com/CCIutZv23Z
— Aaraynsh (@aaraynsh) July 25, 2023
ఈ టైంలో ఇంటి వద్ద ఉండకుండా దుకాణంలో ఎందుకు పనిచేస్తున్నారని అడగ్గా, తాను డబ్బు కోసం పనిచేయడం లేదని, నా మనసు ఆనందంగా ఉండేందుకు పనిచేస్తున్నానని పెద్దాయన బదులిచ్చాడు. ఇంట్లో ఒంటరిగా కూర్చోవడం కంటే ఇక్కడ ఉండటమే మేలు..నా ఫుడ్‌ను తిని నలుగురు సంతోషిస్తే నా మనసు ఆనందంతో ఉప్పొంగుతుందని సమోసా విక్రేత చెప్పుకొచ్చాడు. ఆర్యాన్ష్ వెలుగులోకి తెచ్చిన పెద్దాయన స్టోరీ ఎందరిలోనో స్ఫూర్తి రేకెత్తిస్తోందని పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు. ఈ పోస్ట్‌ను ఏకంగా 12 లక్షల మందికి పైగా వీక్షించారు.
Read More :
Cargo Ship | మంటల్లో 3000 కార్లు.. నడిసముద్రంలో ఫైర్ యాక్సిడెంట్