న్యూ ఢిల్లీ, ఆగస్టు 25: రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అధిపతిగా శాస్త్రవేత్త సమీర్ వీ కామత్ నియమితులయ్యారు. గురువారం కేంద్ర సిబ్బంది శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం డీఆర్డీవోలోని నావర్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్స్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా ఉన్న కామత్.. జీ సతీశ్‌రెడ్డి స్థానంలో బాధ్యతలు స్వీకరిస్తారు. 60 ఏండ్ల వయసు వచ్చేవరకు ఆయన పదవిలో కొనసాగుతారు. కాగా సతీశ్‌రెడ్డి రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించనున్నారు.