న్యూఢిల్లీ, జూలై 8: ఒకే నంబర్ వాట్సాప్‌ను రెండు వేర్వేరు ఫోన్లలో వినియోగించడానికి వాట్సాప్ సంస్థ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నది.
ఈ ఫీచర్‌తో ప్రైమరీ డివైజ్‌తో పాటు, సెకండరీ డివైజ్‌లో కూడా వాట్సాప్ యాక్టివ్‌లోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు చాట్, మీడియా ఫైల్స్ సింక్ అవుతాయని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది.