న్యూఢిల్లీ: మొఘలుల కాలంనాటి షాహీ జామా మసీదు కేసులో ప్రొసీడింగ్స్‌ను తాత్కాలికంగా నిలిపేయాలని సంభల్ ట్రయల్ కోర్టును సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. హింసాత్మక ఘర్షణలు జరిగిన సంభల్‌లో శాంతి, సామరస్యాలను కాపాడాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు కమిషనర్ నిర్వహించిన సర్వే నివేదికను సీల్ చేసి ఉంచాలని, దానిని తెరవవద్దని చెప్పింది.
ట్రయల్ కోర్టు ఆదేశాలపై మసీదు కమిటీ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. సంభల్‌లోని చందౌసీ వద్ద ఉన్న ఈ మసీదును సర్వే చేయడానికి సివిల్ జడ్జి కోర్టు (సీనియర్ డివిజన్) ఈ నెల 19న ఆదేశించింది.