Watch: వర్షం నీటితో నిండిన రోడ్డు.. ఎస్పీ ఎంపీని చేతుల్లో మోసి కారులోకి చేర్చిన సిబ్బంది
Delhi Rains | ఢిల్లీలో భారీ వర్షాలకు సాధారణ ప్రజలతోపాటు రాజకీయ నేతలు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పార్లమెంటుకు బయలుదేరేందుకు సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ఇబ్బంది పడ్డారు. చివరకు సిబ్బంది ఆయనను చేతుల్లో మోసి కారులో కూర్చొబెట్టారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం భారీగా వర్షం కురిసింది. (Delhi Rains) చాలా ప్రాంతాలు వర్షం నీటిలో మునిగాయి. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలతోపాటు రాజకీయ నేతలు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోధి ఎస్టేట్ ప్రాంతం జలమయమైంది. దీంతో పార్లమెంటుకు బయలుదేరేందుకు సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ఇబ్బంది పడ్డారు. చివరకు సిబ్బంది ఆయనను చేతుల్లో మోసి కారులో కూర్చొబెట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, భారీ వర్షం వల్ల తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాలకు వెళ్లేందుకు తాను ఇలా చేయాల్సి వచ్చిందన్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహణ లోపంపై ఆయన మండిపడ్డారు. ఉదయం 4 గంటల నుంచి ఎంసీడీ అధికారులతో మాట్లాడినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయిందన్నారు. రోడ్డుపై నిలిచిన వర్షం నీటిని మోటార్ ద్వారా తొలగించి ఉంటే బాగుండేదని అన్నారు.
మరోవైపు తన బంగ్లా మొత్తం వర్షం నీటితో నిండిపోయిందని ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ తెలిపారు. రెండు రోజుల కిందట ఫ్లోరింగ్ పనులు చేశామని, లక్షల్లో నష్టం వాటిల్లిందని చెప్పారు. ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా వచ్చినప్పటికీ కాలువలను ఎంసీడీ శుభ్రం చేయలేదని ఆరోపించారు. రాష్ట్ర మంత్రి హోదా కలిగిన నీతి ఆయోగ్ సభ్యుడు, మంత్రులు, హోమ్ శాఖ సహాయ మంత్రి, ఆర్మీ జనరల్స్, నేవీ అడ్మిరల్స్ బంగ్లాలు పొరుగున్న ఉన్నాయని తెలిపారు. భారీ వర్షం వల్ల వీరందరికీ ఇబ్బందులు ఉన్నప్పటికీ పూడుకుపోయిన డ్రైనేజీ గురించి ఎంసీడీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు.
#WATCH | Delhi: SP MP Ram Gopal Yadav being helped by members of his staff and others to his car as the area around his residence is completely inundated.
Visuals from Lodhi Estate area. pic.twitter.com/ytWE7MGbfY
— ANI (@ANI) June 28, 2024
#WATCH | SP MP Ram Gopal Yadav says, “NDMC is not prepared. The rainfalls are late, still they didn’t clean the drains…If the drains are cleaned, this situation would never occur. A NITI Aayog member, ministers, MoS Home, other ministers, Navy Admiral, General live here. But… https://t.co/PlLZAUqWw5 pic.twitter.com/RKoAI1Raa4
— ANI (@ANI) June 28, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- car
- Carried
- Delhi
- Delhi rains
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

