లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే రఫీక్ అన్సారీకి 100 సార్లు నాన్ బెయిలబుల్ వారెంట్స్ జారీ అయినా ఖాతరు చేయలేదు. దీంతో సోమవారం ఎట్టకేలకు యూపీ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. మీరట్ సిటీ ఎమ్మెల్యే అయిన అతడికి 1997లో మొదటి వారెంట్ జారీ అయ్యింది. 1995 నాటి అల్లర్ల కేసులో ఆయనపై క్రిమినల్ నేరారోపణలు నమోదయ్యాయి. ట్రయల్ కోర్టు నుంచి 100 సార్లు వారెంట్స్ జారీ అయినా ఆయన లెక్కచేయలేదు. చివరికి హైకోర్టు జోక్యంతో అరెస్టు చేశారు.