ముంబై: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తమకు 5 స్థానాలను ఇవ్వాలని, లేదంటే 25 స్థానాల్లో పోటీ చేస్తామని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)కి సమాజ్‌వాదీపార్టీ హెచ్చరించింది. ఈ కూటమిలో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ), శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ)తోపాటు సమాజ్‌వాదీ పార్టీ కూడా భాగస్వామ్య పక్షమే.
ఎస్పీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అబు అసిం అజ్మీ సీట్ల పంపకాలకు సంబంధించి శుక్రవారం శరద్‌పవార్‌తో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శనివారం మధ్యాహ్నం వరకు సీట్ల కోసం వేచి చూస్తామని తెలిపారు.