భోపాల్: ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌కు మధ్యప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన కుటుంబీకుల స్వాధీనంలోని రూ.15 వేల కోట్ల ఆస్తులను శత్రు ఆస్తులుగా ప్రభుత్వం ప్రకటించడాన్ని ఆయన కుటుంబ సభ్యులు సవాల్ చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ ఆస్తులపై మరోసారి విచారణ జరిపి, ఏడాదిలోగా తీర్పు చెప్పాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది.
బోఫాల్ నవాబు హమీదుల్లా ఖాన్‌కు ఇద్దరు కుమార్తెలు సాజిదా, అబీదా ఉన్నారు. అబీదా 1950లో పాకిస్థాన్‌కు వలస పోయారు. హమీదుల్లాకు చట్టబద్ధ వారసురాలు అబీదా అని, ఆమె పాక్‌కు వలస వెళ్లినందు వల్ల శత్రు ఆస్తుల చట్టం ప్రకారం ఆమె ఆస్తులు శత్రు ఆస్తులని ఎనిమి ప్రాపర్టీ కస్టోడియన్ కార్యాలయం 2015లో ప్రకటించింది. దీన్ని సైఫ్ కుటుంబ సభ్యులు హైకోర్టులో సవాల్ చేశారు.