డెహ్రాడూన్: ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ) నుంచి తొలి మహిళా అధికారిగా సాయ్ జాదవ్ (23) రికార్డ్ సృష్టించారు. ఈ అకాడమీ 1932లో ప్రారంభమైంది. అప్పటి నుంచి 67,000 మందికిపైగా ఆఫీసర్ క్యాడెట్లు పాస్ అవుట్ అయ్యారు. కానీ వీరిలో మహిళలు లేరు. సాయ్ ముత్తాత బ్రిటిష్ ఆర్మీలో పని చేశారు. ఆమె తాత భారత సైన్యంలో చేశారు. ఆమె తండ్రి సందీప్ జాదవ్ ప్రస్తుతం సైన్యంలో పని చేస్తున్నారు. సాయ్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ హోదాలో చేరారు. ఐఎంఏ నుంచి ఈ ఘనతను సాధించిన తొలి అధికారిణిగా ఆమె ఘనత సాధించారు. ఇదిలావుండగా, పురుష క్యాడెట్లతోపాటు రెగ్యులర్ కోర్స్‌కు అవసరమైన అన్ని ప్రమాణాలతో ఆమె ప్రిపరేషన్ సాగింది. ఆమె గ్రాడ్యుయేషన్ తర్వాత జాతీయ స్థాయి పరీక్షలో ఉత్తీర్ణురాలై ఐఎంఏలో ప్రవేశం పొందారు.