న్యూఢిల్లీ : సాహిత్య అకాడమీ బుధవారం 2025వ సంవత్సరానికి 23 మందికి యువ పురస్కారాలను, 24 మందికి బాల సాహిత్య పురస్కారాలను ప్రకటించింది. ఈ ఏడాది డోగ్రి భాషలో యువ పురస్కారం లేదు.
యువ పురస్కారాలు పొందినవారిలో ప్రసాద్ సూరి (తెలుగు), నేహా రుబాబ్ (ఉర్దూ), అద్వైత్ కొట్టరి (ఇంగ్లిష్), పార్వతి టిర్కే (హిందీ) ఉన్నారు. బాల సాహిత్య పురస్కారాలు పొందినవారిలో గంగిశెట్టి శివ కుమార్ (తెలుగు), ఘజన్ఫర్ ఇక్బాల్ (ఉర్దూ) ఉన్నారు.