మీరు మ్యూజిక్ లవర్ అయితే, ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్న కోక్ స్టూడియో సీజన్ 14 ట్రాక్ మీరు తప్పక వినే ఉంటారు. అలీ సేథీ, షే గిల్ పాడిన అందమైన పాకిస్తానీ పాట సంగీత ప్రియులందరినీ కట్టిపడేస్తున్నది. శ్రావ్యమైన సంగీతం, మనోహరమైన సాహిత్యం వరల్డ్ వైడ్గా అనేక మంది హృదయాలను కొల్లగొట్టింది. చాలా మంది కళాకారులు ఈ పాటను పాడుతూ, డ్యాన్స్ చేస్తూ సోషల్మీడియాలో హల్చల్ చేస్తున్నారు. కాగా, పుణె పోలీస్ సాగర్ గోర్పడే ఈ పాటను పాడి ఆకట్టుకున్నాడు.
ఈ వీడియోను సాగర్ గోర్పడే తన ఇన్స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ వీడియోలో పోలీస్ యూనిఫాంలో సాగర్..పసూరీ పాటను ఆలపించారు. ఓ స్టూడియోలో ఆయన ఈ పాట పాడారు. ఈ వీడియో వైరల్గా మారింది. సాగర్ పాట విని నెటిజన్లు మైమరిచిపోయారు. లవ్ ఎమోజీలతో ముంచెత్తారు. చాలా మధురమైన గానం అని కామెంట్ చేశారు.
View this post on Instagram
A post shared by Sagar Ghorpade-Artist/Musician (@sagarghorpadeofficial)