న్యూఢిల్లీ: ఇకపై పాఠశాలల్లో పిల్లల భద్రత, సౌకర్యాలపై తనిఖీలను నిర్వహించడం తప్పనిసరి చేస్తూ కేంద్ర విద్యా శాఖ అన్ని రాష్ర్టాలు, యూటీలకు అదేశాలు జారీ చేసిందని అధికారులు శనివారం తెలిపారు. రాజస్థాన్లోని జల్వార్ జిల్లాలో పాఠశాల పైకప్పు కూలి ఏడుగురు విద్యార్థులు మరణించగా, 28 మంది గాయపడిన క్రమంలో ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
పాఠశాలలపై నిఘా ఉంచి, వాటిలో ప్రమాదకర పరిస్థితులు ఏమన్నా ఉన్నా, విద్యార్థులు వినియోగిస్తున్న రవాణా సౌకర్యాల్లో ఏదైనా లోపాలు ఉన్నా వెంటనే తెలియజేయాలని ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొంది.