లక్నో: పూజారైన వ్యక్తి మహిళలను వేధించినట్లు ఒక కుటుంబం ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఘర్షణ జరుగడంతో ఆ పూజారిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. (Sadhus Thrashed) అయితే ఆ పూజారి కూడా తిరిగి వారిని కొట్టాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఈ సంఘటన జరిగింది. గుప్తర్ ఘాట్ వద్ద మహిళలు, బాలికలను పూజారులు వేధించినట్లు ఒక కుటుంబం ఆరోపించింది. దీని గురించి ఒక పూజారిని వారు నిలదీయడంతో ఘర్షణకు దారితీసింది.
కాగా, ఒక సాధువు ఆ పూజారిని మెల్లగా కొట్టి మందలించి అక్కడి నుంచి పంపేందుకు ప్రయత్నించాడు. అయితే ఇద్దరు వ్యక్తులు ఆ పూజారిని నిలువరించి అతడిపై దాడి చేశారు. ఆ పూజారి కూడా ప్రతిఘటించాడు. వారిని తిట్టడంతోపాటు తిరిగి కొట్టాడు. దీంతో ఇరువురిని విడిపించేందుకు కొందరు ప్రయత్నించారు.
మరోవైపు ఈ విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇద్దరు సాధువులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చారు. తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల వారి మధ్య గొడవ జరిగిందని పోలీస్ అధికారి తెలిపారు. ఇలాంటి సంఘటనలు జరుగకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, ఈ కోట్లాటకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
क्या बना दिया है अयोध्या को🤦🏻♂️🤦🏻♂️ pic.twitter.com/B8wIBKZavU
— Niteesh Rai (@toniteesh) October 23, 2024