పంజాబ్లో బంపర్ మెజారిటీతో విజయం సాధించిన ఆమ్ఆద్మీకి శిరోమణీ అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ శుభాకాంక్షలు తెలిపారు. మనస్ఫూర్తిగా ఆమ్ఆద్మీకి శుభాకాంక్షలు తెలుపుతున్నానని ఆయన ట్వీట్ చేశారు. ‘శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడి హోదాలో నేను ఆమ్ఆద్మీకి శుభాకాంక్షలు తెలుపుతున్నా. సీఎం అభ్యర్థి భగవంత్ మాన్కు కూడా శుభాకాంక్షలు. మున్ముందు మరింత సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. ప్రజల ఆకాంక్షలను చేరువవుతారని భావిస్తున్నా. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తున్నాను. మా కూటమిని నమ్మి.. మాపై నమ్మకముంచిన లక్షలాది మంది పంజాబీలకు రుణపడి ఉంటాం. ప్రజలు మాకు ఏ స్థానాన్ని ఇచ్చారో.. ఆ స్థానంలో ఉంటూ… వారికి సేవ చేస్తాం’ అంటూ సుఖ్బీర్ సింగ్ బాదల్ హామీ ఇచ్చారు.