లఖింపూర్ ఘటనపై సిట్ నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. కేంద్ర మంత్రి పదవి నుంచి అజయ్ మిశ్రాను వెంటనే తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు.లఖీంపూర్ ఘటన ప్రణాళికా బద్ధంగా జరిగిన ఓ కుట్ర అని సాక్షాత్తూ సిట్ చెబుతోందని, అయినా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా కేంద్ర మంత్రి అజయ్మిశ్రాకు ఎందుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారో చెప్పాలని ప్రియాంక డిమాండ్ చేశారు.ఈ ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా పాత్ర ఎంత మేర ఉన్నదన్న విషయాన్ని కూడా దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. లఖింపూర్ ఖేరీ ఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదని, ఈ ఘటన ఓ ప్రణాళికాబద్ధంగా జరిగిన ఓ కుట్ర అని సిట్ పేర్కొంది. యూపీలోని లఖింపూర్ ఖేరీలో కేంద్ర మంత్రి కొడుకు రైతులను కారుతో తొక్కించి చంపిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది.ఈ నేపథ్యంలోనే ప్రియాంక స్పందించారు.