Sabarimala | కొట్టాయం: శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు ఉచిత బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు కేరళ దేవాదాయ శాఖ మంత్రి వీఎన్ వాసవన్ శనివారం చెప్పారు. ఈ నెలాఖరు నుంచి ప్రారంభమయ్యే మండలం-మకరవిళక్కు సీజన్లో శబరిమలను సందర్శించే భక్తులకు రూ.5 లక్షల ఉచిత బీమా సదుపాయం వర్తిస్తుందన్నారు. ఈ దేవాలయం నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించే ట్రావన్కోర్ దేవస్థానం బోర్డు ఈ ఏడాది శబరిమలకు వచ్చే భక్తులందరికీ బీమా కవరేజ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.