BrahMos Missile: రష్యా సైనిక దళాలకు బ్రహ్మోస్.. భారత్ నుంచి క్షిపణుల సరఫరా !
BrahMos Missile: రష్యా సైనిక దళాలకు బ్రహ్మోస్ క్షిపణిని అందివ్వనున్నారు. ఆ క్షిపణులను భారత్ సరఫరా చేసే అవకాశాలు ఉన్నాయి. దీనిపై రష్యాతో చర్చలు జరుగుతున్నట్లు బ్రహ్మోస్ ఏరోస్పేస్ చీఫ్ జైతీర్థ్ జోషి తెలిపారు. ఆ క్షిపణికి ఇప్పటికే ఫుల్ డిమాండ్ ఉంది. దాని ఖరీదుకు వియత్నాం రెఢీగా ఉన్నది.
నాగపూర్: బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్‌ను రష్యా కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా తన సైనిక దళాల్లోకి ఈ అత్యాధునిక క్షిపణి వ్యవస్థను ప్రవేశపెట్టాలని భావిస్తున్నది. బ్రహ్మోస్ క్షిపణిపై రష్యా ఆసక్తిని కనబరుస్తున్నదని బ్రహ్మోస్ ఏరోస్పేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జైతీర్థ జోషి తెలిపారు. నాగపూర్‌లోని సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ సంస్థ 100వ స్వదేశీ బూస్టర్‌ను ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. బ్రహ్మోస్ ప్రోగ్రామ్‌లో రష్యా భాగస్వామ్యమే అయినా, ఈ క్షిపణిని తమ సైనిక దళాల్లోకి తీసుకెళ్లేందుకు ఆ దేశం ఆసక్తి ప్రదర్శిస్తుందని జోషి తెలిపారు.
బ్రహ్మోస్ అంశంలో రష్యా సర్కారు ఆసక్తితో ఉందన్నారు. ఈ అంశంలో ఆ దేశంతో చర్చలు జరుగుతున్నాయని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని బ్రహ్మోస్‌ను రష్యా కోరుతున్నట్లు జోషి చెప్పారు. భవిష్యత్తులో రష్యాకు అవసరమయ్యే క్షిపణులను ఇండియా నుంచి పంపిస్తారా అని అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. రష్యా తయారీ సంస్థలకు భారతీయ పరిశ్రమలు ఊతం అందిస్తాయన్నారు. రష్యా వద్ద సౌకర్యాలు ఉన్నాయని, కానీ అవి సరిపోకపోవచ్చు అని, ఈ అంశంలో రష్యాతో లోతుగా స్టడీ చేసి, అవసరమైన క్షిపణులను పంపనున్నట్లు జోషి తెలిపారు.
భారత్‌కు చెందిన డీఆర్డీవో, రష్యాకు చెందిన ఎన్పీవో మషినోస్ట్రోయేనియా సంయుక్తంగా బ్రహ్మోస్ క్షిపణిని డెవలప్ చేస్తున్నాయి. భారత రక్షణ రంగంలో ఇప్పుడు బ్రహ్మోస్ ఓ కీలక ఎగుమతి వస్తువుగా మారింది. బ్రహ్మోస్ క్షిపణికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు వచ్చిందని, సుమారు 25 ఏళ్ల పాటు సాగిన డెవలప్మెంట్, టెస్టింగ్, ఆపరేషనల్ డెవలప్మెంట్ ఫలితమే బ్రహ్మోస్ అని జోషి పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో బ్రహ్మోస్‌ను సమర్థవంతంగా వినియోగించినట్లు చెప్పారు. ఆపరేషన్ సింధూర్ వేళ లైవ్ టెస్ట్ చేశామని, ఆ సక్సెస్ స్టోరీ ప్రపంచం అంతా చూసిందన్నారు.
బ్రహ్మోస్ క్షిపణులను ఖరీదు చేసేందుకు వియత్నాం కూడా ఆసక్తిగా ఉన్నది. అయితే ఆ డీల్‌కు చెందిన చివరి దశ క్లియరెన్స్‌లు కావాల్సి ఉందని జోషి అన్నారు. కొన్ని తూర్పు, పశ్చిమ దేశాలు కూడా బ్రహ్మోస్‌ను ఖరీదు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఆయన చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

