న్యూఢిల్లీ: భారత్లో పేద బస్తీల్లో గోడలనే తరగతి గదులుగా మార్చిన ‘రూబుల్ నాగి’ ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్’ అందుకున్నారు. గురువారం దుబాయ్లో నిర్వహించిన వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్ వేదికగా పురస్కారాన్ని ప్రదానం చేశారు. అవార్డుతోపాటు మిలియన్ డాలర్లు (సుమారుగా రూ.9 కోట్లు) నగదు ఆమెకు బహుమతిగా దక్కింది.
సామాజిక కార్యకర్తగా, విద్యావేత్తగా ఆమె చేసిన సేవలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. రూబుల్ నాగి తాను స్థాపించిన ఫౌండేషన్ ద్వారా దేశంలోని వెనుకబడిన వర్గాల పిల్లల కోసం ఇప్పటివరకు 800కుపైగా లెర్నింగ్ సెంటర్లు ఏర్పాటుచేశారు.