త్వరలో నీరవ్ మోదీ అప్పగింత!
భారత్‌లో బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్‌కు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు రప్పించేందుకు మార్గం సుగమమైంది. అతడ్ని భారత్‌కు అప్పగించటంలో యూకేలో చట్టపరమైన అడ్డంకి తొలిగిపోయింది.
లండన్, జూలై 6 : భారత్‌లో బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్‌కు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు రప్పించేందుకు మార్గం సుగమమైంది. అతడ్ని భారత్‌కు అప్పగించటంలో యూకేలో చట్టపరమైన అడ్డంకి తొలిగిపోయింది. యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (ఈసీహెచ్ఆర్)లో నీరవ్ మోదీ చేసిన చట్టపరమైన చివరి ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో అతడ్ని భారత్‌కు రప్పించటం దాదాపు ఖాయమైందని భారత దౌత్య వర్గాలు చెబుతున్నాయి.
యూకే కోర్టుల్లో అప్పీల్ చేయడానికి ఉన్న అన్ని దారులను వినియోగించుకున్న నీరవ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈసీహెచ్ఆర్ను ఆశ్రయించారు. కాగా..యూకే కోర్టు ఆయనకు ఉపశమనం కల్పించలేదని, దీంతో అతడికి తదుపరి చట్టపరమైన మార్గాలు ఏవీ అందుబాటులో లేవని సంబంధిత వర్గాలు తెలిపాయి. చట్టపరమైన ప్రక్రియ ముగియటంతో..నీరవ్‌ను భారత అధికారులకు అప్పగించడానికి అవసరమైన పరిపాలనా ప్రక్రియను యూకే ప్రభుత్వం చేపట్టిందని తెలిసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

