Iran | మీతో బంధాన్ని, స్నేహాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం.. భారత్కు ఇరాన్ కృతజ్ఞతలు
Iran | తమ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (Ayathollah Ali Khamenei) అంత్యక్రియల (Funeral) కు హాజరైన భారత ప్రతినిధుల (Indian delegation) కు ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం (Iran Embassy) కృతజ్ఞతలు తెలిపింది. ఈ దుఃఖ సమయంలో ఇరాన్ ప్రజలకు అండగా నిలిచి, తమ సానుభూతిని ప్రకటించిన భారత్ (Iran) ను మరిచిపోలేమని తెలిపింది.
Iran : తమ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (Ayathollah Ali Khamenei) అంత్యక్రియల (Funeral) కు హాజరైన భారత ప్రతినిధుల (Indian delegation) కు ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం (Iran Embassy) కృతజ్ఞతలు తెలిపింది. ఈ దుఃఖ సమయంలో ఇరాన్ ప్రజలకు అండగా నిలిచి, తమ సానుభూతిని ప్రకటించిన భారత్ (Iran) ను మరిచిపోలేమని తెలిపింది. ఈ చర్య ఇరుదేశాల మధ్య స్నేహానికీ, అనుబంధానికీ ప్రతీక అని, చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నది. ఇరుదేశాల మధ్య ఉన్న ఈ చిరకాల బంధాన్ని, స్నేహాన్ని ఇరాన్ ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారని తెలిపింది.
ఇరాన్ దివంగత సుప్రీం నేత ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఆయన భౌతికకాయాన్ని రాజధాని టెహ్రాన్లోని గ్రాండ్ మొసల్లా మసీదులో ఉంచారు. దేశ విదేశీ ప్రతినిధులు, అధికారులు ఆయన భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. భారత్ తరఫున బీహార్ గవర్నర్, సయ్యద్ అతా హస్నైన్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటా నివాళులర్పించారు. కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతోపాటు భారత్కు చెందిన సిక్కు, హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు అంత్యక్రియలకు హాజరయ్యారు. ఖమేనీ పార్థివ దేహాన్ని ఆయన సొంత పట్టణం మషహద్లో ఈనెల 9న ఖననం చేయనున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

