లోక్సభ ఎన్నికల కోసం వసూళ్లు
వచ్చే లోక్సభ ఎన్నికల కోసం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడంటూ కర్ణాటక ఎక్సైజ్ శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత ఆర్బీ తిమ్మపురపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఒక ఫిర్యాదు అందింది. సమాచార హక్కుల కార్యకర్త దినేశ్ కల్లహళ్లి ఈ ఫిర్యాదు చేసినట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి.
- కర్ణాటక కాంగ్రెస్ ఎక్సైజ్ మంత్రి అవినీతి బాగోతం
- తిమ్మపురపై ఈడీకి ఫిర్యాదు చేసిన ఆర్టీఐ కార్యకర్త
బెంగళూరు, జనవరి 23: వచ్చే లోక్సభ ఎన్నికల కోసం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడంటూ కర్ణాటక ఎక్సైజ్ శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత ఆర్బీ తిమ్మపురపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఒక ఫిర్యాదు అందింది. సమాచార హక్కుల కార్యకర్త దినేశ్ కల్లహళ్లి ఈ ఫిర్యాదు చేసినట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి. మంత్రి తిమ్మపుర అవినీతి అక్రమాలను నిలువరించాలని, అతని అక్రమ వసూళ్లను అరికట్టాలని దినేశ్ తన ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు.
ముగ్గురు డిప్యూటీ కమిషనర్లు, తొమ్మిది మంది ఎస్పీలు, 13 మంది డీవైఎస్పీలు, 20 మంది ఇన్స్పెక్టర్ల ద్వారా మంత్రి తిమ్మపుర రూ.18 కోట్ల వరకు వసూలు చేశాడని ఆరోపించారు. బెంగళూరు శివార్లలోని పోలీస్స్టేషన్లలో గత మూడున్నరేండ్లుగా విధులు నిర్వహిస్తున్న ఇన్స్పెక్టర్ల స్థానంలోకి బదిలీని కోరుతున్న ఇన్స్పెక్టర్ల నుంచి రూ.50 లక్షల వరకు లంచం వసూలు చేశారని పేర్కొన్నారు. ఇన్స్పెక్టర్ల బదిలీల జాబితా ప్రస్తుతం సీఎం వద్ద ఉన్నదని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

