ముంబై, ఆగస్టు 7: మహారాష్ట్రలో రూ.800 కోట్ల విలువైన ‘మియావ్ మియావ్’ మాదక ద్రవ్యాన్ని గుజరాత్ యాంటీ టెర్రరిజం స్కాడ్ (ఏటీఎస్) స్వాధీనం చేసుకున్నది. భివాండీలోని ఒక ఫ్లాట్‌పై దాడి చేసిన ఏటీఎస్ సిబ్బంది ద్రవరూపంలో ఉన్న 792 కిలోల మెఫెడ్రాన్ (ఎండీ) డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
గత కొద్దికాలంగా నిఘా ఉంచిన ఏటీఎస్ అధికారులు దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీటినిఎక్కడికి పంపుతున్నారు? వాటి నెట్వర్క్ వివరాలను రాబట్టడానికి అధికారులు వారిని ప్రశ్నిస్తున్నారు. కాగా, ఇటీవల కాలంతో మహారాష్ట్రలో ఇంత భారీ యెత్తున మాదకద్రవ్యాలు పట్టుబడటం ఇదే తొలిసారి.