Carry Bag | న్యూఢిల్లీ: ‘సంచి లాభం చిల్లు తీర్చింది’ అని తెలుగులో ఉన్న సామెతను నిజం చేస్తూ క్యారీ బ్యాగ్ ఇచ్చి రూ.18 వసూలు చేసిన ఒక వ్యాపార సంస్థకు రూ.35 వేల జరిమానా పడింది. ఒక షర్ట్‌ను కొన్న కొనుగోలుదారుడికి ఇచ్చే క్యారీబ్యాగ్‌కు రూ.18 వసూలు చేసిన ఒక రిటైల్ చైన్ స్టోర్‌కు లక్నో వినియోగదారుల న్యాయస్థానం రూ.35 వేల జరిమానా విధించింది.
ఇందులో అతడు చెల్లించిన రూ.18కు 9 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాలని, రూ.25 వేలు ఆయన అనుభవించిన మానసిక వేదనకు నష్టపరిహారంగా, మిగిలినది కోర్టు, ఇతర ఖర్చులకు ఇవ్వాలని ఆదేశించింది. ఆ వ్యాపార సంస్థ కొనుగోలుదారునికి లోపభూయిష్టమైన సేవలు అందించడమే కాక, అతనిపట్ల అనుచితంగా ప్రవర్తించిందని కోర్టు వ్యాఖ్యానించింది. శశికాంత్ శుక్లా అనే వ్యక్తి 2023లో లక్నోలోని ఒక పెద్ద స్టోర్‌లో ఒక షర్ట్ కొన్నప్పుడు ఈ కేసు నమోదైంది.