తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి పంజాబ్ పారిశ్రామికవేత్త రాజిందర్ గుప్తా భారీ విరాళం ఇచ్చారు. టీటీడీ ఆదివారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ప్రాణాంతక వ్యాధులతో బాధపడే పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించే ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు ఆయన రూ.21 కోట్లు విరాళం ఇచ్చారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి చెక్కును అందజేశారు. టీటీడీ నిర్వహిస్తున్న దవాఖానలు, ప్రసూతి దవాఖానల్లో ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ పథకం అందుబాటులో ఉంది.