ED Seize Cash Jharkhand IAS | జార్ఖండ్ ఐఏఎస్ అధికారి పూజా సింఘాల్ ఇద్దరు అనుయాయుల వద్ద రూ.19.31 కోట్ల నగదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు జప్తు చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ)లో దుర్వినియోగం, అవినీతికి సంబంధించి ఇటీవల జరిగిన సోదాల్లో ఈ నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వర్గాలు తెలిపారు.
రూ.19.31 కోట్లలో రూ.17 కోట్లు పూజా సింఘాల్ చార్టర్డ్ అకౌంటెంట్ సుమన్ కుమార్ ఇంట్లో రూ.17 కోట్లు, మరో వ్యక్తి ఇంటి వద్ద రూ.1.8 కోట్లు అదనంగా దొరికాయి ఈడీ వర్గాల కథనం. పూజాసింఘాల్ నివాసంలో జరిపిన సోదాల్లో అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు గల పత్రాలను జప్తు చేశామని ఈడీ అధికారి ఒకరు తెలిపారు.