Madras High Court : టీవీకే చీఫ్ (TVK chief) విజయ్ (Vijay) కి మద్రాసు హైకోర్టు (Madras High Court) నోటీసులు జారీచేసింది. ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో అవకతవకలు ఉన్నాయంటూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. దానిని పరిశీలించిన అనంతరం సోమవారం కోర్టు ఈ నోటీసులు ఇచ్చింది. విజయ్‌కి సమర్పించిన అఫిడవిట్లలో తేడాలు ఉన్నాయంటూ చెన్నైకి చెందిన వీవీ విఘ్నేశ్ (VV Vignesh) మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
కాగా తిరుచ్చి, పెరంబూర్ నియోజకవర్గాల నుంచి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పోటీచేస్తున్నారు. పెరంబూర్‌లో సమర్పించిన అఫిడవిట్లో ఆయన ఆస్తుల వివరాలు రూ.115 కోట్లుగా ఉండగా.. తిరుచ్చిలో రిటర్నింగ్ ఆఫీసర్‌కు ఇచ్చిన వివరాల్లో వెల్లడించిన ఆస్తుల విలువ రూ.220 కోట్లుగా ఉందని పిటిషనర్ ఆరోపించారు. ఇలా ఎందుకు తేడా చూపించాల్సి వచ్చిందో వివరించేలా ఎలాంటి అనుబంధ పత్రాలు విజయ్ ఇవ్వలేదన్నారు. కాగా వచ్చేవారం దీనిపై తదుపరి విచారణ జరగనుంది.