గువాహటి: అస్సాంలో రూ.100 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను తరలిస్తూ ఇద్దరు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. అంతర్జాతీయ మార్కెట్‌కు సంబంధాలు కలిగిన వీరిని బుధవారంనాడు కమ్రప్ మెట్రోపాలిటిన్ జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. మణిపూర్ నుండి వస్తున్న ట్రక్కును సోనాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని టోల్‌ప్లాజా వద్ద అడ్డుకొని తనిఖీలు చేయగా 4.6 యాబా టాబ్లెట్స్, 12 కిలోల మెథాంపెటమైన్, 1.5 కిలోల హెరాయిన్ బయటపడ్డాయి. దీంతో పోలీసులు ట్రక్కును స్వాధీనం చేసుకొని, నిందితులను అరెస్టు చేశారు.