న్యూఢిల్లీ: భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ అంతరిక్షంలో సత్తా చాటింది. (Space Robotic Arm) రీలోకేటబుల్ రోబోటిక్ మానిప్యులేటర్-టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ (RRM-TD) పని తీరును ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. డిసెంబర్ 30న స్పేస్ డాకింగ్ మిషన్‌కు సంబంధించిన రెండు స్పెడెక్స్ శాటిలైట్లను ఇస్రో ప్రయోగించింది. రాకెట్ నుంచి వేరైన ఈ రెండు ఉపగ్రహాలు అంతరిక్షంలో పరిభ్రమిస్తున్నాయి. మరి కొన్ని రోజుల్లో ఈ రెండు శాటిలైట్లను స్పేస్‌లో ఇస్రో అనుసంధానించనున్నది.
కాగా, స్పేస్ డాకింగ్ మిషన్‌కు సంబంధించిన కీలక ప్రక్రియను ఇస్రో నిర్వహించింది. వాకింగ్ రోబోటిక్ ఆర్మ్‌గా వ్యవహరించే ఆర్ఆర్ఎం-టీడీ పనితనాన్ని శనివారం పరీక్షించింది. బేస్ పొజిషన్ నుంచి స్పేస్ రోబోటిక్ చేయి అన్‌లాక్ అయ్యింది. కొంత పైకి లేచిన ఈ రోబో చేయి తిరిగి తన స్థితికి చేరుకున్నది.
మరోవైపు ఇస్రోలోని ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్ (ఐఐఎస్‌యూ) అభివృద్ధి చేసిన అంతరిక్ష రోబోటిక్ చేతిలో ఏడు కదిలే కీళ్ళు ఉన్నాయి. పీఎస్4-ఆర్బిటల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ (POEM-4) ప్లాట్‌ఫారమ్‌లోని నిర్దిష్ట లక్ష్యాలకు అనుగుణంగా భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ అంతరిక్షంలో పని చేయనున్నది. దీని తొలి పని తీరు వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో ఇస్రో షేర్ చేసింది.
🇮🇳 #RRM_TD, India’s first space robotic arm, is in action onboard #POEM4! A proud #MakeInIndia milestone in space robotics. 🚀✨ #ISRO #SpaceTech pic.twitter.com/sy3BxrtRN1
— ISRO (@isro) January 4, 2025