కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్పై మరో వివాదం చెలరేగింది. తన సొంత విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. (Bengal Governor Statue) దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే రాజ్‌భవన్ కార్యాలయం స్పష్టత ఇచ్చింది. అది వాస్తవం కాదని పేర్కొంది. బెంగాల్ గవర్నర్ పదవిని ఆనంద్ బోస్ చేపట్టి నవంబర్ 23కు మూడేళ్లయ్యింది. ఈ సందర్భంగా ఆ రాష్ట్రానికి చెందిన కొందరు కళాకారులు తమ కళా రూపాలను ఆయనకు బహూకరించారు. ఈ నేపథ్యంలో శిల్పి పార్థ సాహా రూపొందించిన తన సొంత విగ్రహాన్ని కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియంలో గవర్నర్ ఆనంద్ బోస్ ఆవిష్కరించారు.
కాగా, బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ తన సొంత విగ్రహాన్ని ఆవిష్కరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. సొంత పబ్లిసిటీ కోసం ఆయన ఆరాటపడుతున్నారని ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఎంసీ ఆరోపించింది. ‘స్వాతంత్య్రం తర్వాత భారతదేశం ఎప్పుడూ ఇలాంటి విచిత్రమైన సంఘటన చూడలేదు. రాజ్యాంగ పదవికి నియమించిన ఒక వ్యక్తి రోమన్ చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు’ అని టీఎంసీ నేత జై ప్రకాష్ మజుందార్ విమర్శించారు.
మరోవైపు ఈ విమర్శలపై రాజ్‌భవన్ కార్యాలయం స్పందించింది. గవర్నర్ తన సొంత విగ్రహాన్ని ఆవిష్కరించినట్లుగా మీడియాలో వచ్చిన వార్తలు వాస్తవం కాదని తెలిపింది. చాలా మంది కళాకారులు తమ కళారూపాలను గవర్నర్‌కు సమర్పించినట్లు పేర్కొంది. ఇందులో భాగంగా ఒక సృజనాత్మక శిల్పి గవర్నర్ బోస్ శిల్పాన్ని రూపొందించి బహూకరించినట్లు వివరించింది. అయితే దురదృష్టవశాత్తూ తన సొంత విగ్రహాన్ని గవర్నర్ ఆవిష్కరించినట్లుగా తప్పుడు ప్రచారం జరుగుతోందని ఎక్స్‌లో పేర్కొంది.
📜 On November 23, 2024, Indian Museum embraced the spirit of #ApnaBharatJagtaBengal on the twenty-third day of our month-long celebration, to mark the commencement of Dr. C. V. Ananda Bose, the Hon’ble Governor of West Bengal’s third-year in office, as visionary leader of state. pic.twitter.com/qNg7eGhu6Q
— Indian Museum (@IndianMuseumKol) November 23, 2024
In some media reports it has come out that HG has ‘unveiled his own statue’ at Raj Bhavan on 23.11.2024.
The fact is as follows:
Many artists submit their artistic creations to HG. Many painters made HG’s portraits and presented to him. Similarly a creative sculptor had…
— Raj Bhavan Media Cell (@BengalGovernor) November 24, 2024