చండీగఢ్: ఒక మహిళ తన పిల్లలతో కలిసి వీధిలో నడుస్తున్నది. ఇంతలో ఒక ఇంటి పైకప్పు వారిపై కూలింది. (Roof Collapses On Woman, Children) ఈ సంఘటనలో ఆ ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పంజాబ్ రాజధాని చండీగఢ్‌లో ఈ సంఘటన జరిగింది. మణిమజ్రా ప్రాంతంలో పాతి ఇంటిని కొందరు కూల్చుతున్నారు. ఆ సమయంలో ఒక మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి ఆ వీధిలో నడిచి వెళ్తున్నది. అయితే ఆ ఇంటి పైకప్పు అకస్మాత్తుగా వారిపై కూలిపోయింది.
కాగా, ఈ సంఘటనలో ఆ మహిళతోపాటు ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆమెను చండీగఢ్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఏడేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలకు కూడా చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించారు. నిర్లక్ష్యం వహించిన ఆ ఇంటి యజమానితోపాటు, ఇంటిని కూల్చుతున్న కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#Video | In Punjab Horror, Roof Collapses On Woman, Child Walking In Street
Read more: https://t.co/A3kCYSk2Al pic.twitter.com/JFG4YYqrqx
— NDTV (@ndtv) December 7, 2023