Road accident : ఉదయాన్నే దట్టంగా కమ్మేసిన పొగమంచు (Fog) నలుగురిని బలితీసుకున్నది. పొగమంచు కారణంగా విజిబిలిటీ సరిగా లేకపోవడంతో కారు (Car) ముందు వెళ్తున్న లారీ (Truck) ని ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం సాగర్ జిల్లా (Sagar district) లోని సాగర్-ఛత్తార్పూర్ రహదారిపై హీరాపూర్ గ్రామం (Hirapur Village) వద్ద ఈ ప్రమాదం జరిగింది.
స్థానికుల ద్వారా ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. మృతులంతా కారులో విధుల కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు విచారణలో తేలింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.