న్యూఢిల్లీ, నవంబర్ 11: అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ అసలు స్వభావం బయటపడేసరికి విపక్ష ‘ఇండియా’ కూటమిలో ఆయా పార్టీలు తట్టుకోలేకపోతున్నాయి. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తున్న ఆర్ఎల్డీ 5 నుంచి 6 స్థానాలు ఆశించింది. చివరి సమయంలో ఒకే ఒక్క స్థానం బలవంతంగా ఇస్తామని కాంగ్రెస్ చెప్పటం ఆర్ఎల్డీని షాక్‌కు గురిచేసింది. ‘ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్ కలుపుకు పోవటం లేదు.
ఇదే పద్ధతిలో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతాం. యూపీలో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటో వారికి గుర్తుచేస్తాం’ అని ఆర్ఎల్డీ నాయకుడు ప్రశాంత్ కనోజియా ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తీరుతో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) విసుగెత్తిపోయింది. విపక్ష ‘ఇండియా’ కూటమిలోని ప్రాంతీయ పార్టీలకు సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదని కాంగ్రెస్‌పై ఎస్పీ మండిపడింది. తాజాగా రాజస్థాన్‌లో కాంగ్రెస్ పొత్తు రాజకీయాలకు ఆర్ఎల్డీ బలైంది.