Manoj Jha : మోదీ సర్కార్ రైల్వేలను నిర్వీర్యం చేస్తోందని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ఆర్జేడీ నేత మనోజ్ ఝా సమర్ధించారు. మమతా బెనర్జీ వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని అన్నారు.
రైల్వే మంత్రి, ప్రధాని వందే భారత్ ట్రైన్ ప్రారంభించడంలో బిజీగా ఉన్నారని, స్లీపర్ కోచ్‌ల పరిస్ధితి ఎలా ఉంది..? అసలు ప్రభుత్వ ప్రాధాన్యాలేంటని ఆయన నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం రైల్వేల విషయంలో ఏమాత్రం జవాబుదారీతనం లేకుండా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.
ఇక పశ్చిమ బెంగాల్‌లోని డార్జలింగ్లో జరిగిన రైలు ప్రమాదం నేపధ్యంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మోదీ సర్కార్‌పై మండిపడ్డారు. రైల్వేల్లో ఇప్పుడు ఏం జరుగుతున్నదో ఎవరికీ తెలియని పరిస్ధితి నెలకొందని, రైల్వే మంత్రిత్వ శాఖలో సమస్యలు చుట్టుముట్టాయని ఆందోళన వ్యక్తం చేశారు . రైల్వేలను మోదీ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు.
Read More :
Darjeeling | ఆ రూట్లో మళ్లీ ప్రారంభమైన రైళ్ల రాకపోకలు..