న్యూయార్క్ : బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన కల్ హో న హో మూవీలోని ప్రెట్టీ ఉమెన్ సాంగ్‌కు అమెరికన్ డాడ్ రికీ పాండ్ తన కొడుకుతో కలిసి స్టెప్పులేసిన వీడియో (Viral Video) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రికీ పాండ్ తన కొడుకుతో కలిసి బాలీవుడ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పటివరకూ లక్షకు పైగా వ్యూస్ లభించాయి.
ఈ వైరల్ క్లిప్‌లో రికీ అతడి కొడుకు సమన్వయంతో ఎంతో ఈజ్‌తో బాలీవుడ్ నెంబర్‌కు స్టెప్పులేయడం కనిపిస్తుంది. వీరి డ్యాన్స్ పెర్ఫామెన్స్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఇక 2003లో విడుదలైన కల్ హో న హో మూవీలో ప్రెట్టీ విమెన్ సాంగ్ అప్పట్లో పలువురిని ఆకట్టుకోగా ఈ సినిమాకు నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించారు. ఈ పాటను షారుక్ ఖాన్, ప్రీతి జింతాపై తెరకెక్కించారు.
Read More