హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు ఏటుకూరి కృష్ణమూర్తి (104) ఆదివారం సాయం త్రం కన్నుమూశారు. ప్రజల సందర్శనార్థం కృష్ణమూర్తి భౌతికకాయాన్ని సోమవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఉంచారు.
సీపీఐ నేతలు కే నారాయణ, పల్లా వెంకటరెడ్డి, కే రామకృష్ణ, పద్మ, చాడ వెంకటరెడ్డి, కే శ్రీనివాస్‌రెడ్డి, నెల్లికంటి సత్యం తదితరులు నివాళులర్పించారు. అనంతరం భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానానికి తరలించారు. అకడ ఆయన కుమారుడు ఏటుకూరి శ్రీనివాసమూర్తి అంత్యక్రియలను పూర్తి చేశారు.