ఊరించి.. ఉసూరుమనిపించి..
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజుతో ఉద్యోగ జేఏసీ నేతలు సోమవారం జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. డిప్యూటీ సీఎం అందుబాటులో లేరన్న కారణంతో చర్చలను మంగళవారానికి వాయిదా వేశారు. దీంతో తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న ఆశతో చర్చలకు వెళ్లిన జేఏసీ నేతలకు నిరాశే మిగిలింది.
- ఉద్యోగుల డిమాండ్లపై చర్చలకు పిలిచి స్పష్టమైన హామీలు ఇవ్వని సర్కార్
- సీఎస్‌తో అసంపూర్తిగా ముగిసిన జేఏసీ నేతల చర్చలు.. నేటికి వాయిదా
- ఉద్యోగుల జేఏసీని లైట్ తీసుకున్న సర్కార్
- అవమానభారంతో తిరిగొచ్చిన నేతలు
- అక్టోబర్ 2 నుంచి నిరవధిక సత్యాగ్రహ దీక్షకు దిగుతాం : జేఏసీ వెల్లడి
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజుతో ఉద్యోగ జేఏసీ నేతలు సోమవారం జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. డిప్యూటీ సీఎం అందుబాటులో లేరన్న కారణంతో చర్చలను మంగళవారానికి వాయిదా వేశారు. దీంతో తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న ఆశతో చర్చలకు వెళ్లిన జేఏసీ నేతలకు నిరాశే మిగిలింది. ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర డిమాండ్లను పరిష్కరించడంలో భాగంగా తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీని సర్కార్ సోమవారం చర్చలకు ఆహ్వానించింది. తొలుత మధ్యాహ్నం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు సమక్షంలో చర్చలు జరుగగా, రెండు జేఏసీలకు చెందిన నాయకులు హాజరయ్యారు.
అరగంట ఆలస్యంగా మధ్యాహ్నం 3:30 గంటలకు చర్చలు ప్రారంభమయ్యాయి. ఎంప్లాయీస్ హెల్త్‌స్కీమ్ (ఈహెచ్ఎస్)పైనే దాదాపు 45 నిమిషాలపాటు చర్చ జరిగింది. అయితే, తాము ప్రస్తావించని ఈహెచ్ఎస్పై అనవసర చర్చ ఇప్పుడు ఎందుకుని కొందరు జేఏసీ నేతలు ప్రశ్నించినట్టు సమాచారం. పీఆర్సీ, ఆరు పెండింగ్ డీఏలు, పెండింగ్ బిల్లుల విడుదల మొత్తాన్ని రూ.వెయ్యి కోట్ల నుంచి రూ.రెండు వేల కోట్లకు పెంచడం, సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పింఛన్ విధానం పునరుద్ధరించడం, 2004కు ముందు నియమితులైన వారికి పాత పింఛన్ అమలు చేయాలన్న డిమాండ్లను జేఏసీ నేతలు సర్కార్ ముందుపెట్టారు. దీనిపై సీఎస్ స్పందిస్తూ.. ‘పీఆర్సీ పెండింగ్‌లో ఉన్నది. న్యాయంగా డీఏలు రావాల్సిందే.
పెండింగ్ బిల్లులు ఇవ్వాల్సిందే. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేద’ని చెప్పినట్టు తెలిసింది. ఆయా అంశాలపై ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంతో మాట్లాడి స్పష్టత తీసుకుంటానని సీఎస్ చెప్పడమే కాకుండా సాయంత్రం 6 గంటలకు చర్చలను వాయిదావేశారు. దీంతో సాయంత్రం ఏదో ఒక స్పష్టత వస్తుందని జేఏసీ నేతలు ఆశించారు. మళ్లీ చర్చల కోసం జేఏసీ నేతలు సాయంత్రం 6 గంటలకు సచివాలయానికి వెళ్లారు. డిప్యూటీ సీఎం తిరుపతి పర్యటనలో ఉన్నారని, మంగళవారం సాయంత్రం 6 గంటలకు మరోసారి సమావేశమై చర్చిద్దామని అధికారులు జేఏసీ నేతలకు తెలిపారు. దీంతో మంగళవారానికి చర్చలు వాయిదాపడ్డాయి.
చర్చల సందర్భంగా పీఆర్సీ రిపోర్టు ప్రభుత్వానికి అందలేదని సీఎస్ చెప్పగా.. పీఆర్సీ కమిషన్ నివేదిక ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నదని, ఐదు నిమిషాల్లో నివేదిక ఇస్తుందని జేఏసీ నేతలు వ్యాఖ్యానించినట్టు సమాచారం. దీనిపై సీఎస్ స్పందిస్తూ.. పీఆర్సీ నివేదికను అధ్యయనం చేయాల్సి ఉంటుందని, క్యాబినెట్లో చర్చించాల్సి ఉంటుందని చెప్పినట్టు తెలిసింది. మొత్తంగా చర్చల సందర్భంగా సీఎస్ వ్యవహరించిన తీరుపట్ల జేఏసీ నేతలు నొచ్చుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. సీఎస్ సంజయ్‌జాజు ప్రవర్తనను జీజేఎల్ఏ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి ఖండించారు. సెప్టెంబర్ 18న జరుగాల్సిన చర్చలను సోమవారానికి వాయిదా వేసుకున్న తర్వాత కూడా స్పష్టత రాకపోవడం దారుణమని ఓ నేత పేర్కొన్నారు. ఈహెచ్ఎస్పై డిప్యూటీ సీఎం వద్దే సమావేశం జరిగిందని, మళ్లీ చర్చ పెట్టి విలువైన సమయాన్ని వృథా చేశారని మరో నేత మండిపడ్డారు.
నిరవధిక సత్యాగ్రహ దీక్ష
ఉద్యోగుల సమస్యలు పరిష్కారంలో సర్కార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించాలని ఎంప్లాయీస్ జేఏసీ భావిస్తున్నది. తాజా పరిణామాల నేపథ్యంలో జేఏసీ నాయకత్వం సోమవారం రాత్రి నాంపల్లి టీఎన్జీవో భవన్లో అత్యవసరంగా భేటీ అయ్యింది. ఈ నెల 30వ తేదీలోపు పీఆర్సీ నివేదికను తెప్పించుకొనేందుకు గడువు పెట్టింది. గడువు లోగా నాలుగు ప్రధాన డిమాండ్లను పరిష్కరించకపోతే అక్టోబర్ 2 నుంచి ఇందిరాపార్క్ వద్ద నిరవధిక సత్యాగ్రహ దీక్షకు దిగాలని జేఏసీ నేతలు భావిస్తున్నారు.
జేఏసీ నాయకత్వమంతా మూకుమ్మడిగా సత్యాగ్రహ దీక్షను చేపట్టాలన్న చర్చలు జేఏసీలో నడుస్తున్నాయి. 206 సంఘాలకు చెందిన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో దీక్షలకు దిగాలని, రాత్రి కూడా అక్కడే నిద్రించి సర్కార్‌కు నిరసన తెలుపాలన్న చర్చలు నడుస్తున్నాయి. ఈ దీక్షలకు జిల్లాల నుంచి ఉద్యోగులు హైదరాబాద్‌కు భారీ సంఖ్యలో తరలివచ్చేలా కార్యాచరణ ఉండాలన్న యోచనలో జేఏసీ నాయకులున్నారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సత్యాగ్రహ దీక్షతో సర్కార్‌ను ఇరకాటంలో పెట్టాలని, సర్కార్‌పై ఒత్తిడి పెంచాలన్న ఆలోచన చేస్తున్నట్టు జేఏసీ నాయకులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

