Rice Export Ban | బియ్యం ఎగుమతిపై కేంద్రం బ్యాన్
Rice Export Ban | బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం గురువారం నిషేధం విధించింది. పండగలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నది. దేశీయంగా సరఫరాను పెంచే లక్ష్యంతో నిర్ణయం తీసుకోగా.. రిటైల్ ధరలు అదుపులో ఉండనున్నాయి.
Rice Export Ban | బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం గురువారం నిషేధం విధించింది. పండగలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నది. దేశీయంగా సరఫరాను పెంచే లక్ష్యంతో నిర్ణయం తీసుకోగా.. రిటైల్ ధరలు అదుపులో ఉండనున్నాయి. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. బాస్మతియేతర ఉస్నా బియ్యం, బాస్మతి బియ్యం ఎగుమతి విధానంలో ఎలాంటి మార్పు ఉండదు. దేశం నుంచి ఎగుమతి అవుతున్న మొత్తం బియ్యంలో బాస్మతీయేతర బియ్యం వాటా 25శాతం.
2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుంచి సన్న బియ్యం మొత్తం ఎగుమతి 4.2 మిలియన్ల డాలర్లకు చేరువలో ఉన్నది. అంతకుముందు సంవత్సరంలో ఎగుమతులు 26.2 మిలియన్లు డాలర్లుగా ఉండేది. భారతదేశం ప్రధానంగా థాయ్‌లాండ్, ఇటలీ, స్పెయిన్, శ్రీలంక, అమెరికాకు సన్న బియ్యాన్ని ఎగుమతి చేస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో ఖరీఫ్‌లో పంటల ఉత్పత్తి తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో బియ్యాన్ని కొద్దిరోజుల పాటు నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తున్నది. మరో ఇప్పటికే టమాట, పచ్చిమిర్చీ సహా పలు కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

