RG Kar rape | ఆర్జీకర్ హత్యాచార ఘటన.. విచారణలో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు ఐపీఎస్‌ల సస్పెండ్
RG Kar rape : పశ్చిమ బెంగాల్‌లోని ఆర్జీకర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మమత హయాంలో జరిగిన ఈ కేసు విచారణపై ఇప్పుడు బెంగాల్‌లోని బీజేపీ సర్కార్ దృష్టిపెట్టింది.
RG Kar rape : పశ్చిమ బెంగాల్‌లోని ఆర్జీకర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మమత హయాంలో జరిగిన ఈ కేసు విచారణపై ఇప్పుడు బెంగాల్‌లోని బీజేపీ సర్కార్ దృష్టిపెట్టింది. ఈ కేసు విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, తప్పుదోవపట్టించడం వంటివి చేసినందుకు ముగ్గురు పోలీసు అధికారులపై సీఎం సువేందు అధికారి వేటు వేశారు. నన్బానాలో నిర్వహించిన ప్రెస్మీట్లో సువేందు అధికారి ఈ విషయంపై ప్రకటన చేశారు. ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
అలాగే, శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించారు. వినీత్ గోయల్ (కోల్‌కతా పోలీస్ కమిషనర్)తోపాటు అభిషేక్ గుప్తా, ఇందిరా ముఖోపాధ్యాయ్ అనే ముగ్గురిని సస్పెండ్ చేశారు. బాధితురాలి తల్లికి ఈ పోలీసులు లంచం ఇవ్వజూపారని, అలాగే వారి అనుమతి లేకుండానే ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారని సీఎం అన్నారు. ఆగష్టు, 2024లో కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల యంగ్ డాక్టర్ హత్యాచారానికి గురైంది. దీంతో ఈ ఘటన సంచలనం సృష్టించింది. డాక్టర్లు, విద్యార్థులు, ప్రజలు ఆందోళన నిర్వహించారు. నిందితుల్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. కానీ, ఈ కేసు విషయంలో అప్పటి మమత సర్కార్ సరిగ్గా వ్యవహరించలేదనే విమర్శ ఉంది.
ఆధారాల్ని మాయం చేయడం, పోలీసులు ఆలస్యంగా స్పందించడం, నిర్లక్ష్యం వంటి కారణంగా బాధిత కుటుంబానిక సరైన న్యాయం జరగలేదనే ప్రచారం ఉంది. తీవ్ర విమర్శలు, ఆరోపణల తర్వాత ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించింది అప్పటి ప్రభుత్వం. ఈ అంశం ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కీలకంగా మారింది. మమత ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. అలాగే, మృతురాలి తల్లిని బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేయించగా, ఆమె 28 వేల ఓట్ల మెజారిటీతో గెలిచింది. బీజేపీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ఈ కేసు విచారణ మరోసారి తెరమీదకు వచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

