న్యూఢిల్లీ : సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) ఉత్పత్తి చేస్తున్న కరోనా కొత్త వ్యాక్సిన్ ‘కోవోవాక్స్’ టీకాపై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ (NTAGI) గ్రూప్ సమీక్షించనున్నది. ఏప్రిల్ 1న సమావేశం జరుగనున్నది. ఇమ్యునైజేషన్ కోసం ఏర్పాటైన అడ్వైజరీ గ్రూప్ టీకా డేటాను పరిశీలించి.. భద్రత, ప్రభావాన్ని అంచనా వేయనున్నది.
చర్చల అనంతరం వ్యాక్సిన్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలా ఉండగా.. అందరికీ బూస్టర్ డోస్ గురించి ఆలోచన లేదని, శుక్రవారం జరిగే సమావేశంలో టెక్నికల్ గ్రూప్ అందరికీ బూస్టర్ డోస్ లేదా ప్రికాషనరీ డోస్ గురించి చర్చించదని సంబంధిత వర్గాలు తెలిపాయి.ఇటీవల డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) కోవోవాక్స్ టీకా అత్యవసర వినియోగం కోసం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
12 సంవత్సరాలుపైబడిన వారందరికీ టీకా అందుబాటులో ఉండనున్నది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ట్రయల్స్ నోవోవాక్స్ టీకా 90శాతం కంటే ఎక్కువగా ప్రభావవంతంగా ఉందని తేలిందని సీరమ్ ఇన్స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా పేర్కొన్నారు. కోవోవాక్స్ టీకాను భారత్‌లో సీరమ్ కంపెనీ కోవోవాక్స్ పేరుతో ఉత్పత్తి చేస్తున్నది.