Online gaming| న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్‌పై 28 శాతం జీఎస్టీ విధింపును ఉపసంహరించుకోవాలని 127 ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు, ఆర్గనైజేషన్లు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి. ఈ మేరకు శనివారం బహిరంగ లేఖ రాశాయి. బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ను, స్కిల్ గేమింగ్‌ను వేర్వేరుగా చూడాలని కోరాయి. ట్యాక్స్‌ను భారీగా పెంచడం వల్ల ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. బాజీ గేమ్స్, దంగల్ గేమ్స్, గేమ్స్క్రాఫ్ట్ టెక్నాలజీస్, వింజో గేమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర సంస్థలు లేఖ రాసిన వాటిలో ఉన్నాయి. దేశంలో ఆన్లైన్ గేమర్ల సంఖ్య 2020లో 36 కోట్లు ఉండగా, ఈ ఏడాది అది 42 కోట్లకు చేరింది.